తబలాపై ఇక ఆ చేతులు నర్తించవు!

December 17, 2024
img

భారత్‌కు గర్వకారణమైన ప్రముఖ తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ అలా రఖా ఖురేషి (73) కన్ను మూశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తులకు సంబందించిన వ్యాధితో బాధపడుతున్న ఆయన రెండు వారాల క్రితం శాన్‌ఫ్రాన్సిస్‌కోలో ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కానీ ఆయన ఆరోగ్యం క్షీణించి ఆదివారం సాయంత్రం 4 గంటలకు, అణగా భారతీయ కాలమాన ప్రకారం సోమవారం ఉదయం 5.30 గంటలకు ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఈ విషయం ఆయన సోదరి ఖుర్షీద్ ఔలియా స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 

 ఉస్తాద్ జాకీర్ హుస్సేన్‌ భార్య ఆంటోనియా మినెకోలా ప్రముఖ కధక నృత్య కళాకారిణి. వారికి అనిషా  ఖురేషీ, ఈసాబెల్లా ఖురేషీ అనే ఇద్దరు కుమార్తెలున్నారు. వారందరూ అమెరికాలోనే స్థిరపడ్డారు. 

ఉస్తాద్ జాకీర్ హుస్సేన్‌ అనేక మంది ప్రముఖ కళాకారులతో, సంస్థలతో కలిసి పనిచేశారు. ఆయన ప్రతిభకు దేశవిదేశాలలో అనేక అవార్డులు అందుకున్నారు. 

ఉస్తాద్ జాకీర్ హుస్సేన్‌కు 1988లోనే కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, 2002 లో పద్మభూషణ్, 2023 లో పద్మ విభూషణ్ అవార్డులతో సన్మానించింది. 1990లో అత్యంత ప్రతిష్టాత్మకమైన సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్నారు. 2009 లో మిక్కీ హార్డర్‌ కలిసి ప్లానెట్ డ్రమ్ ఆల్బమ్ చేయగా దానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రామీ అవార్డు అనుకున్నారు.

తొలిసారి గ్రామీ అవార్డు సాధించిన ఉస్తాద్ జాకీర్ హుస్సేన్‌ మళ్ళీ 2024లో జరిగిన గ్రామీ అవార్డులలో ఒకేరాత్రి వరుసగా మూడుసార్లు గ్రామీ అవార్డులు అందుకున్నారు. విదేశాలలో సైతం తన ప్రతిభతో మన దేశవ్యాప్తంగా ప్రతిష్ట ఇనుమడింపజేసిన ఉస్తాద్ జాకీర్ హుస్సేన్‌ ఇక లేరంటే సంగీత ప్రియులు జీర్ణించుకోవడం చాలా కష్టమే. 

Related Post