ఫిలిపిన్స్‌లో పటాన్‌చెరు యువతి అనుమానస్పద మృతి

November 15, 2024
img

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇంద్రేశమ్ గ్రామానికి చెందిన స్నిగ్ధ అనే యువతి ఫిలిపిన్స్‌ దేశంలో మృతి చెందింది. వైద్య విద్య అభ్యసించేందుకు ఆమె ఫిలిపిన్స్‌ వెళ్ళింది. అక్కడ కాలేజీ హాస్టల్లోనే ఉంటూ చదువుకుంటోంది.

ఆమె పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు తోటి విద్యార్ధినులు ఆమె హాస్టల్ గదికి వెళ్ళగా అక్కడ ఆమె అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉంది. అది చూసి షాక్ అయిన ఆమె స్నేహితులు వెంటనే హాస్టల్ వార్డెన్‌కు సమాచారం అందించారు. ఫిలిపిన్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని, ఆమె శరీరాన్ని పోస్టు మార్టంకు తరలించారు.

ఆమె తండ్రి అమృత్ రావు తెలంగాణ విద్యుత్ శాఖలో డీఈవోగా చేస్తున్నారు. కూతురు చనిపోయిందన్న వార్త విని స్నిగ్ధ తల్లితండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం విదేశాంగశాఖతో మాట్లాడి ఆమె మృతదేహాన్ని హైదరాబాద్‌ రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆమె మరణానికి కారణం ఇంకా తెలియవలసి ఉంది.

Related Post