అమెరికా అధ్యక్ష ఎన్నికలలో భారతీయ సంతతికి చెందిన కమలా హారిస్ ఓడిపోయారు. ఒకవేళ ఆమె గెలిచి ఉండి ఉంటే భారత్‌కు ఏమైనా మేలు చేసేవారో లేదో తెలీదు కానీ తొలిసారిగా భారతీయ మూలాలున్న మహిళా అమెరికా అధ్యక్షురాలు అయ్యే అవకాశం కోల్పోయినందుకు చాలా మంది భారతీయులు బాధపడటం సహజం. కమలా హారిస్ ఓడిపోయినప్పటికీ, అమెరికా ఉపాధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టబోతున్న జేడీ వాన్స్ సతీమణి ఉషా చిలుకూరి కూడా భారతీయ మూలాలు ఉన్నవారే. ఆమె పూర్వీకులు ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణాజిల్లాకు చెందినవారు.
ట్రంప్ సతీమణి మేలానియా అమెరికా ‘ఫస్ట్ లేడీ’గా కాబోతుండగా, మన తెలుగమ్మాయి ఉషా చిలుకూరి అమెరికా ‘సెకండ్ లేడీ’గా గౌరవం అందుకోబోతున్నారు. ప్రపంచాన్ని శాశిస్తున్న అగ్రరాజ్యం అమెరికాలో ఇంత మన భారతీయ మూలాలున్న మహిళలు ఇంత అత్యున్నత స్థానాలకు చేరుకొని, గౌరవమర్యాదలు పొందుతుండటం మనకీ గర్వకారణమే కదా?