అమెరికా అధ్యక్ష ఎన్నికలలో మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ దూసుకుపోతున్నారు. ఇప్పటివరకు 10 రాష్ట్రాలలో పోలింగ్ ముగియగా వాటిలో టెన్నిసీ, అలబామా, ఫ్లోరిడా, ఓక్లహోమా, ఇండియానా, కెంటకీ, వెస్ట్ వర్జీనియా, సౌత్ కరోలినా రాష్ట్రాలలో ట్రంప్ విజయం సాధించారు.
డెమొక్రాట్ అభ్యర్ధిగా ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మేరీల్యాండ్, కొలంబియా, మసాచూసెట్స్,ఇల్లినాయిస్, వెర్మాంట్‌లో కమలా హారిస్ గెలిచారు.
ఈ ఎన్నికల ఫలితాలను నిర్ణయించే ఏడు ‘స్వింగ్ స్టేట్స్’ పెన్సిల్వేనియా, ఆరిజోనా, జార్జియా, మిచిగాన్, నెవడా, నార్త్ కరోలినా, విస్కాన్సిన్ రాష్ట్రాలలో డొనాల్డ్ ట్రంప్‌కు 58.2 శాతం ఓట్లు రాగా, కమలా హారిస్‌కు 49 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక అధ్యక్ష అన్నికలలో కీలకమైన ఎలక్టోరల్ ఓట్లలో కూడా డొనాల్డ్ ట్రంప్‌కు 177 ఓట్లు రాగా, కమలా హారిస్‌కు 99 ఓట్లు మాత్రమే వచ్చాయి. 270 ఓట్లు సాధించినవారే విజేతలు.
ఈ ఫలితాలను బట్టి చూస్తే అమెరికా ప్రజలు డొనాల్డ్ ట్రంప్‌కు ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతోంది. కనుక మళ్ళీ ఆయన అమెరికా అధ్యక్షుడవబోతున్నట్లు స్పష్టమవుతోంది.