ఇరాన్‌తో యుద్ధానికి అమెరికా రెడీ!

November 03, 2024
img

అమెరికా, ఇరాన్ దేశాల మద్య ఏ క్షణంలోనైనా యుద్ధం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్ హెచ్చరికలతో అప్రమత్తమైన అమెరికా తన వాయుసేనలో అత్యంత శక్తివంతమైన బీ-52 సూపర్ సోనిక్ లాంగ్ రేంజ్ యుద్ధ విమానాలను రొమేనియాకి పంపించింది. వాటితో పాటు భారీ యుద్ధ నౌకలు, వివిద రకాల ఫైటర్ జెట్ ప్లేన్స్, బాలిస్టిక్ మిసైల్స్ వగైరాలన్నీ పశ్చిమాసియాలోని సెంట్రల్ కమాండ్ ఏరియాకు శనివారం  చేరుకున్నాయి.

వాటిని అక్కడకు పంపడం తమని యుద్ధానికి ఆహ్వానించడంగానే పరిగణిస్తామని, వాటిని చూసి తాము భయపడబోమని, అమెరికాకు గట్టిగా బుద్ధి చెపుతామని ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హెచ్చరించారు.

తాము చాలా సంయమనం పాటిస్తున్నామని కానీ అమెరికా కవ్వింపు చర్యల వలన తమ అణువిధానాన్ని మార్చుకుని అమెరికాపై దాడికి సిద్దపడక తప్పదనిపిస్తోందని ఖమేనీ ప్రధాన సలాదారు కమాల్ ఖర్రాజ్ హెచ్చరించారు.

మరోపక్క ఇజ్రాయెల్‌ కూడా లెబనాన్ మీద ఇంకా విరుచుకుపడుతూనే ఉంది. ఇరాన్ అమెరికాపై అణుక్షిపణి ప్రయోగించిన్నట్లయితే అమెరికా, ఇజ్రాయెల్‌ విమానాలు ప్రపంచ పటం నుంచి ఇరాన్‌ని కనబడకుండా తుడిచిపెట్టేసినా ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం అత్యంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణంలోనైనా అమెరికా, ఇరాన్ మద్య యుద్ధం మొదలయ్యే ప్రమాదం పొంచి ఉంది. 

Related Post