తెలంగాణకు మరో రెండు అంతర్జాతీయ కంపెనీలు

August 09, 2024
img

సిఎం రేవంత్‌ రెడ్డి బృందం అమెరికా పర్యటనలో తెలంగాణ రాష్ట్రానికి మరో రెండు అంతర్జాతీయ సంస్థలని రప్పించడానికి ఒప్పందాలు జరిగాయి. వాటిలో ఒకటి మీడియా రంగానికి చెందిన కామ్‌కాస్ట్ కంపెనీ, మరొకటి ఆర్ధిక సేవలు అందించే చార్లెస్ ష్వాబ్. 

హాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ యూనివర్సల్ స్టూడియో కామ్‌కాస్ట్ కంపెనీకి మాతృసంస్థ. ఇది వెబ్‌సైట్లకు సంబందించి వ్యాపారంలో ఉంది. ఈ సంస్థ హైదరాబాద్‌లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్‌ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. సిఎం రేవంత్‌ రెడ్డి బృందం ఆ సంస్థ ప్రతినిధులతో ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు. 

 ఆర్ధిక సేవలు అందించే చార్లెస్ ష్వాబ్ సంస్థ హైదరాబాద్‌ టెక్నికల్ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. భారత్‌లో తొలిసారిగా తమ సంస్థ హైదరాబాద్‌లో కేంద్రాన్ని ఏర్పాటుచేస్తోందని, హైదరాబాద్‌ కేంద్రంగా భారత్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభిస్తామని ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారు. 

ఈ రెండు సంస్థల ఏర్పాటుకి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తుందని సిఎం రేవంత్‌ రెడ్డి, ఐ‌టి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. ఈ రెండు సంస్థల ద్వారా హైదరాబాద్‌లో వేలాదిమందికి ఉద్యోగాలు, ఉపాది లభిస్తాయన్నారు.

Related Post