అమెరికా సీక్రెట్ సర్వీస్ ఇంత వైఫల్యమా!

July 16, 2024
img

ప్రపంచంలోకెల్లా అత్యంత సమర్ధమైన నిఘా సంస్థలలో అమెరికాకు చెందిన సీక్రెట్ సర్వీసస్ కూడా ఒకటి. కానీ వారి సమక్షంలోనే ఇటీవల డొనాల్డ్ ట్రంప్‌పై థామస్ మాథ్యూ క్రూక్స్ అనే యువకుడు హత్యాయత్నం చేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. 

మరీ ముఖ్యంగా ట్రంప్‌ భద్రత కొరకు ఏ భవనంలో బట్లర్ కౌంటీ ఎమర్జన్సీ సర్వీసస్ యూనిట్ నిఘా పెట్టిందో, అదే భవనం పైకప్పు మీద నుంచి క్రూక్స్ ట్రంప్‌పై తుపాకీతో కాల్పులు జరపడం దిగ్బ్రాంతి కలిగిస్తుంది. 

ట్రంప్‌ సభ మొదలయ్యే అర్ధగంట ముందు క్రూక్స్  ఓ బ్యాగ్‌తో ఆ భవనంలోకి ప్రవేశిస్తున్నప్పుడు, అక్కడే ఉన్న ఓ పోలీస్ అధికారి అతనిని ఆపి ఫోటో కూడా తీసుకొని అతని వివరాలను కమాద్ కంట్రోల్ సెంటర్‌కు పంపించాడని సీక్రెట్ సర్వీసస్ ధృవీకరించింది. 

ఈ ఘటన జరిగినప్పుడు క్రూక్స్ ఆ భవనం పైకప్పుపై తుపాకీతో పడుకున్న ఓ ఫోటో కూడా బయటకు వచ్చింది. ఇంత జరుగుతున్నా అమెరికా సీక్రెట్ సర్వీసస్ ఏజంట్స్ జరుగబోయే ప్రమాదాన్ని ముందుగా పసిగట్టలేకపోవడం దిగ్బ్రాంతి కలిగిస్తుంది. 

ఈ ఘటన తర్వాత అమెరికన్ సీక్రెట్ సర్వీసస్ దర్యాప్తులో క్రూక్స్ తండ్రి పేరుతో 20 తుపాకులు కొనుగోలు చేసిన్నట్లు గుర్తించారు. వాటన్నిటికీ ఆయన లైసెన్స్ కూడా కలిగిఉన్నారు. ఓ సాధారణ పౌరుడు 20 తుపాకులు కొనుగోలు చేసినప్పుడే అమెరికన్ సీక్రెట్ సర్వీసస్‌కు అనుమానం కలిగి ఉండాలి. 

అప్పుడు రాకపోయినా క్రూక్స్ ఓ బ్యాగుతో భవనంవైపు వస్తున్నప్పుడైనా అనుమానం కలిగి సోదా చేసి ఉండాలి. కానీ ట్రంప్‌పై తుపాకీతో కాల్పులు జరిపే వరకు ఎవరికీ అనుమానం కలుగలేదు. ఒకవేళ క్రూక్స్ కాల్పులలో ట్రంప్‌ మరణించి ఉంటే, అమెరికాకు ఆ అపఖ్యాతి ఎప్పటికీ మిగిలిపోతుంది కదా?

Related Post