రష్యాలో నలుగురు భారతీయ వైద్య విద్యార్దులు మృతి చెందారు. మహారాష్ట్రకు చెందిన నలుగురు విద్యార్దులు సెయింట్ పీటర్స్ బర్గ్ సమీపంలో గల వెల్కీ నోవ్‌గోరోడ్ స్టేట్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతున్నారు.
వారు నలుగురు సెయింట్ పీటర్స్ బర్గ్ నగరం గుండా పారుతున్న వొల్కోవ్ నదిలో ఓ యువతి కొట్టుకుపోతుండటం చూసి ఆమెను కాపాడే ప్రయత్నంలో నలుగురు నదిలో కొట్టుకుపోయారు. మరో భారత్ విద్యార్ధిని స్థానికులు కాపాడారు.
నదిలో కొట్టుకుపోయిన నలుగురిలో ఇద్దరి మృతదేహాలను గజఈతగాళ్ళు బయటకు తీశారు. మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు. కానీ వారి ఆచూకీ లభించలేదని రష్యాలో భారత్ ఎంబసీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
వారు కూడా చనిపోయే ఉండవచ్చని గజ ఈతగాళ్ళు చెప్పారు. వారి మృతదేహాలు కూడా లభ్యమైతే నలుగురినీ ఒకేసారి మహారాష్ట్రలోని వారి సొంత జిల్లా జలగావ్‌కు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని భారత్ ఎంబసీ తెలియజేసింది.