బ్రిటన్ రాజు ఛార్లెస్‌కు క్యాన్సర్

February 06, 2024
img

బ్రిటన్ రాజు ఛార్లెస్‌ (75) ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో ఆయన ఆస్పత్రిలో చేరినప్పుడు ప్రోస్టేట్ గ్రంధికి సంబందించిన వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు, క్యాన్సర్ సోకిన్నట్లు వైద్యులు నిర్ధారించారు. కానీ ప్రోస్టేట్ క్యాన్సర్ కాదని వైద్యులు తెలిపారు. 

ఆయన క్యాన్సర్ బారిన పడ్డారనే విషయం బకింగ్ హమ్ ప్యాలస్ రాజభవనం ధృవీకరించింది కానీ శరీరంలో ఏ భాగానికి అనేది వెల్లడించలేదు. దీనికి ఆయన కొన్ని రోజులు వైద్య చికిత్స తీసుకోవలసి ఉంటుంది కనుక విధులకు హాజరు కాబోరని అధికారులు తెలియజేశారు. 

ప్రిన్స్ ఛార్లెస్ కూడా తాను క్యాన్సర్ వ్యాధి బారిన పడిన్నట్లు ధృవీకరించారు. వైద్యులు అత్యుత్తమ చికిత్స అందిస్తున్నారని, త్వరలోనే క్యాన్సర్ బారి నుంచి బయటపడి మళ్ళీ విధులకు హాజరవుతానని చెప్పారు.

Related Post