ఉపాధ్యక్ష పదవికి వివేక్‌ రామస్వామి ఒకే!

January 17, 2024
img

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్ధిగా భారత్‌ మూలాలు కలిగిన వివేక్‌ రామస్వామి బరిలో దిగిన సంగతి తెలిసిందే. కానీ తొలి ప్రైమరీ పోరులో ఈ పదవికి పోటీ పడుతున్న మాజీ  అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు 51 శాతం ఓట్లు లభించగా, వివేక్‌ రామస్వామికి కేవలం 7.7 శాతం మాత్రమే లభించడంతో ఆయన ఈ రేసు నుంచి తప్పుకుని డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతు ప్రకటించారు. 

ఈ సందర్భంగా జరిగిన సభలో డొనాల్డ్ ట్రంప్‌ అభిమానులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “వివేక్‌ రామస్వామి చాలా అద్భుతంగా ప్రచారం చేశారు. ఆయనను ఉపాధ్యక్ష సహచరుడుగా నాతోనే ఉంటారు. ఇద్దరం కలిసి మన రిపబ్లికన్ పార్టీని మళ్ళీ గెలిపించుకుంటాము,” అని అన్నారు. 

న్యూ హాంప్‌షైర్‌లో జరిగిన సభలో డొనాల్డ్ ట్రంప్‌, వివేక్‌ రామస్వామి ఇద్దరూ కలిసి ఒకే వేదికపై అభిమానులను ఉద్దేశ్యించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఇద్దరూ పరస్పరం ప్రశంసించుకున్నారు కూడా. కనుక అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ తరపున వీడిరద్దరూ కలిసి ముందుకు సాగబోతునట్లే భావించవచ్చు. ఈ ఏడాది నవంబర్‌ 5వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగబోతున్నాయి. 

Related Post