డోనాల్డ్ ట్రంప్‌పై అనర్హత వేటు వేసిన కొలోరొడో సుప్రీంకోర్టు

December 20, 2023
img

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు కొలోరొడో సుప్రీంకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. ఆయనపై అనర్హత వేటు వేసి వచ్చే ఎన్నికలలో కొలోరొడో నుంచి పోటీ చేయకుండా నిషేదించింది. 

గత అధ్యక్ష ఎన్నికలలో డోనాల్డ్ ట్రంప్‌ ఓడిపోబోతున్నట్లు స్పష్టం కాగానే ఆయన మద్దతుదారులు 2021, జనవరి 6న యూఎస్ క్యాపిటల్ భవనంపై దాడులు చేశారు. దీనిని ప్రభుత్వంపై తిరుగుటే అని దానిని డోనాల్డ్ ట్రంప్ ప్రోత్సహించారని కొలోరొడో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 

అమెరికా రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు, హింసను ప్రేరేపించినందుకు డోనాల్డ్ ట్రంప్‌పై అనర్హత వేటువేస్తున్నట్లు కొలోరొడో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఆయన అమెరికా అధ్యక్ష పదవి చేపట్టేందుకు అనర్హుడని కనుక కొలోరొడో రాష్ట్రంలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధుల ఎంపికలో కూడా ఆయన పోటీ పడకూడదని తేల్చి చెప్పింది. అయితే ఈ తీర్పుపై అమెరికా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకొనేందుకు అనుమతించింది. 

ప్రతీ నాలుగేళ్ళకు ఓ సారి నవంబర్‌ 5వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతుంటాయి. కనుక 2024 నవంబర్‌ 5న జరుగబోయే అధ్యక్ష ఎన్నికలలో డోనాల్డ్ ట్రంప్‌ మళ్ళీ పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు. కానీ కొలోరొడో సుప్రీంకోర్టు తాజాతీర్పుతో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. కనుక అమెరికా సుప్రీంకోర్టు ఈ తీర్పుపై స్టే విధించి అనుమతిస్తేనే డోనాల్డ్ ట్రంప్‌ అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేయగలుగుతారు.

Related Post