హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ సంస్థ... స్టేట్ స్ట్రీట్!

May 24, 2023
img

ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసస్ మరియు ఇన్స్యూరెన్స్ రంగంలో అగ్రగామిగా ఉన్న అమెరికాకు చెందిన స్టేట్ స్ట్రీట్ ఆర్ధిక సంస్థ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలు విస్తరించబోతోందని మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా తెలియజేస్తూ ఆ సంస్థ ప్రతినిధులతో సమావేశమైనప్పుడు తీసుకొన్న కొన్ని ఫోటోలను కూడా పోస్ట్ చేశారు. 40 ట్రిలియన్ డాలర్స్ విలువగల ఈ సంస్థ ద్వారా హైదరాబాద్‌లో 5,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. వాటిలో అకౌంటింగ్, హెచ్ఆర్, డాటా అనలైటిక్స్ ఇంకా అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి సంబందించిన ఉద్యోగాలు లభించనున్నాయని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. 


Related Post