తెలంగాణకు క్యూకడుతున్న అమెరికన్ కంపెనీలు

May 19, 2023
img

తెలంగాణ ఐ‌టి పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ బృందం రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు సాధించేందుకు ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. కేటీఆర్‌ బృందం అమెరికా పర్యటనలో రెండో రోజున జాప్‌కామ్ గ్రూప్ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యి హైదరాబాద్‌లో వారి సంస్థ ఏర్పాటు చేసేందుకు ఒప్పించారు. జాప్‌కామ్ గ్రూప్ సంస్థ హైదరాబాద్‌లో ‘సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్’ ఏర్పాటు చేసేందుకు కేటీఆర్‌ బృందం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. 

జాప్‌కామ్ గ్రూప్ సంస్థ అమెరికాలో కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా నగరాలలో విస్తరించి తన కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ సంస్థ ప్రజా రవాణా, హోటల్స్, ఫిన్‌టెక్ మరియు రీటెయిల్ సెక్టర్లకు ఇనజనీరింగ్ విభాగంలో అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందజేస్తుంది. ప్రధానం ఏఐ, ఎన్‌ఎల్‌పీ ఆధారిత  ఉత్పత్తులలో అగ్రగామిగా ఉంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే ఈ సంస్థ ద్వారా తొలిదశలో 500 మంది వచ్చే ఏడాది నుంచి మరో 1,000 మందికి పైగా ఉద్యోగాలు కల్పించబోతోందని మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. 

తెలుగువరైనా పల్లంరెడ్డి జాప్‌కామ్ గ్రూప్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో కావడం, అమెరికాలో పలు నగరాలకు తమ కార్యకలాపాలను విస్తరించడమే కాకుండా ఇప్పుడు హైదరాబాద్‌లో తమ సంస్థను ఏర్పాటు చేసేందుకు అంగీకరించడం చాలా అభినందనీయం.

          

Related Post