పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌

May 09, 2023
img

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మంగళవారం ఉదయం ఇస్లామాబాద్ హైకోర్టు ఆవరణలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయనపై దాదాపు 85 కోర్టులలో అవినీతి ఆరోపణలకు సంబందించి కేసులు ఉన్నాయి. కనుక ఆయన స్వచ్ఛందంగా లొంగిపోకపోతే అరెస్ట్‌ చేయాలంటూ మార్చి 7వ తేదీన ఇస్లామాబాద్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అదే కేసులో ఆయన ఈరోజు హైకోర్టుకు హాజరుకాబోతుంటే సాయుధ బలగాలు ఆయనను చుట్టుముట్టి అరెస్ట్‌ చేసి తమతో తీసుకువెళ్లిపోయాయి.

ఈ సందర్భంగా ఆయన పిటిఐ పార్టీ మద్దతుదారులకు, భద్రతాదళాలకు మద్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలలో పలువురు గాయపడ్డారు. ఇమ్రాన్ ఖాన్ అరెస్టును నిరసిస్తూ పిటిఐ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఆయన అరెస్టును సవాలు ఇస్లామాబాద్ హైకోర్టులో ఓ పిటిషన్‌ కూడా వేసింది. దానిపై విచారణ చేపట్టిన హైకోర్టు చీఫ్ జస్టిస్ అమర్ ఫరూక్, ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌పై కోర్టుకు తక్షణం కోర్టుకు హాజరయ్యి సంజాయిషీ ఇవ్వాలని ఇంటీరియర్ మంత్రిత్వశాఖ దర్శి, అడిషనల్ అటార్నీ జనరల్‌ను ఆదేశించారు.

ఇస్లామాబాద్ పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యగా నగరంలో కర్ఫ్యూ విధించారు. అవినీతి కేసులలోనే ఆయనను అరెస్ట్‌ చేశామని, త్వరలోనే కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.        

ఇమ్రాన్ ఖాన్ 2018 ఆగ్స్త్ నుంచి 2022 ఏప్రిల్ వరకు పాకిస్తాన్ ప్రధానమంత్రిగా వ్యవహరించారు. ఆ సమయంలోనే ఆయన భారీగా అవినీతికి పాల్పడి వేలకోట్లు వెనకేసుకొన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 

Related Post