న్యూయార్క్‌లో అల్లు అర్జున్‌ దంపతులకు అరుదైన గౌరవం

August 22, 2022
img

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా), న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్‏లకు చెందిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ సభ్యులు కలిసి భారత్ వజ్రోత్సవ వేడుకలను చాలా అట్టహాసంగా నిర్వహించారు. ఆదివారం న్యూయార్క్ నగరంలో ఇండియా డే పరేడ్ ఘనంగా నిర్వహించారు. ఈ పరేడ్‏లో అల్లు అర్జున్‌ దంపతులకు అరుదైన గౌరవం లభించింది. దీనిలో భాగంగా గ్రాండ్ మార్షల్ హోదాలో  అల్లు అర్జున్‌ తన సతీమణి స్నేహతో కలిసి జీపులో మువ్వన్నెల జెండాపట్టుకొని ర్యాలీకి నాయకత్వం వహించారు.

ఈ పరేడ్‏లో వేలాదిమంది భారతీయులు పాల్గొని ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. న్యూయార్క్ నగరవీదులలో ఎక్కడ చూసిన మువ్వన్నెల జెండాలే కనిపించాయి. ఓ పక్క కొందరు డ్రమ్స్ వాయిస్తుంటే వాటికి అనుగుణంగా భారతీయ మహిళలు డ్యాన్స్ చేస్తుంటే, వారితో అమెరికన్లు కూడా ఆడిపాడారు.

చాలా మంది అమెరికన్లు అల్లు అర్జున్‌ని చూసినప్పుడు పుష్పా... పుష్పా అంటూ ‘తగ్గేదేలే...’ అంటూ సిగ్నేచర్ మూమెంట్ చేయడం విశేషం.  

అనంతరం అల్లు అర్జున్‌ తానా సభ్యులతో కలిసి న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్, ఆయన కార్యాలయ అధికారులను కలిశారు. అక్కడ వారందరూ కూడా అల్లు అర్జున్‌తో కలిసి పుష్ప సినిమాలో ‘తగ్గేదేలే...’ అంటూ సిగ్నేచర్ మూమెంట్ చేయడం విశేషం. 


అల్లు అర్జున్‌ అమెరికాలో ఉండగానే ఇక్కడ హైదరాబాద్‌లో సోమవారం పుష్ప-2 ది రూల్‌కి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మళ్ళీ మూడు నెలల వరకు మంచి ముహూర్తాలు లేనందున పుష్ప-2తో పాటు ఇవాళ్ళ మరో నాలుగైదు సినిమాలకు కూడా హైదరాబాద్‌లో పూజా పూజా కార్యక్రమాలు జరిగాయి.


Related Post