జపాన్ మాజీ ప్రధాని మృతి

July 08, 2022
img

జపాన్ మాజీ ప్రధాని మృతి  షింజో అబే మృతి చెందినట్లు లిబరల్ డెమొక్రెటిక్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈరోజు ఆయన నర నగరంలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా హటాత్తుగా ఓ వ్యక్తి అతి సమీపం నుంచి ఆయనపై తుపాకితో కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన ఆయనను సిబ్బంది హెలికాప్టర్‌లో హాస్పిటల్‌కు తరలించారు. కానీ ఛాతిలో నుంచి రెండు బుల్లెట్లు దూసుకుపోవడంతో ఆయన ఘటనాస్థలంలోనే చనిపోయారు. 

ఈ నెల 10వ తేదీన జపాన్ పార్లమెంటు ఎగువ సభకు ఎన్నికలు జరుగబోతున్నాయి. వాటి కోసమే ఆయన తమ లిబరల్ డెమొక్రెటిక్ పార్టీ తరపున నర నగరంలో ఓ రైల్వేస్టేషన్‌ సమీపంలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా ఓ దుండగుడు అతి సామీపం నుంచి రెండుసార్లు ఆయనపై కాల్పులు జరిపాడు. భారత్‌తో సహా ప్రపంచదేశాలన్నీ ఈ దారుణహత్యపై దిగ్బ్రాంతి, సంతాపం వ్యక్తం చేస్తున్నాయి. 


Related Post