జపాన్ మాజీ ప్రధాని షింజో అబే శుక్రవారం నర నగరంలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా హటాత్తుగా ఓ వ్యక్తి ఆయనపై తుపాకితో కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన ఆయనను సిబ్బంది హాస్పిటల్‌కు తరలించారు. తాజా సమాచారం ప్రకారం ఆయన ఘటనాస్థలంలోనే చనిపోయినట్లు తెలుస్తోంది. కానీ ఈ వార్తను వైద్యులు, జపాన్ ప్రభుత్వం ఇంకా దృవీకరించవలసి ఉంది.
ఈ నెల 10వ తేదీన జపాన్ పార్లమెంటు ఎగువ సభకు ఎన్నికలు జరుగబోతున్నాయి. వాటి కోసమే ఆయన తమ లిబరల్ డెమొక్రెటిక్ పార్టీ తరపున నర నగరంలో ఓ రైల్వేస్టేషన్ సమీపంలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా ఆయనపై కాల్పులు జరిగాయి.
షింజో అబే రెండుసార్లు జపాన్ ప్రధానిగా చేశారు. అంత సుదీర్గకాలం ప్రధాని పదవిలో కొనసాగిన వ్యక్తిగా జపాన్ రాజకీయాలలో రికార్డు సృష్టించారు. 2020లో ఆరోగ్య కారణాలతో తన పదవికి రాజీనామా చేశారు. కానీ పార్టీపై తన పట్టు నిలుపుకొంటూ జపాన్ ప్రభుత్వాన్ని శాశిస్తున్నారు.