యూరోప్‌లోని డెన్మార్క్ రాజధాని కోపెన్‌హగెన్‌లో ఆదివారం సాయంత్రం రద్దీగా ఉన్న ఫీల్డ్స్ షాపింగ్ మాల్‌లో ముగ్గురు దుండగులు జొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వారి కాల్పులలో ముగ్గురు అక్కడే చనిపోగా అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకొన్న పోలీసులు వెంటనే షాపింగ్ మాల్‌ను చుట్టుముట్టి వారిలో ఒకరిని మట్టుబెట్టి ఇద్దరినీ పట్టుకొన్నారు. వారిలో ఒకరు 40 ఏళ్ళు, మరో ఇద్దరు 22 ఏళ్ళు వయసుంతుందని కోపెన్‌హగెన్ పోలీస్ ఉన్నతాధికారి సొరేన్ తోమస్సేన్ తెలిపారు. కాల్పులలో గాయపడినవారిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిలో మరో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఆదివారం సాయంత్రం కావడంతో ఫీల్డ్స్ షాపింగ్ మాల్ చాలా రద్దీగా ఉంది. కానీ కాల్పుల శబ్ధం వినపడగానే లోపల ఉన్నవారు వెంటనే ప్రాణభయంతో బయటకు పరుగులు తీయడం, 10-15 క్షణాల వ్యవధిలోనే పోలీసులు దుండగులను బందించగలగడంతో ప్రాణనష్టం చాలా వరకు తగ్గింది.