అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని శాన్ ఆంటోనియాలో అందరినీ కలచివేసే విషాద ఘటన చోటుచేసుకొంది. దక్షిణ శాన్ ఆంటోనియా వద్ద ఓ రైల్వే లైన్ సమీపంలో ఓ భారీ ట్రక్ నిలిపివేసి ఉంది. ట్రక్కు డ్రైవర్ దానిని వదిలేసి వెళ్లిపోవడంతో గత 24 గంటలుగా అక్కడే ఉండిపోయింది. పోలీసులు అక్కడకు చేరుకొని ట్రక్కు తలుపు తాళాలు పగులగొట్టి చూడగా లోపల 42 మంది చనిపోయున్నారు. మరో 16 మంది కొన ప్రాణాలతో ఉన్నారు. వారిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. పోలీసులు వారిని వెంటనే అంబులెన్సులలో స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేసి వారి ప్రాణాలు కాపాడారు.
వారందరూ పొరుగునే ఉన్న మెక్సికో నుంచి రహస్యంగా అమెరికాలో ప్రవేశించే ప్రయత్నంలో చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆస్పత్రిలో ఉన్నవారు కొలుకొంటే గానీ వారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎవరు వారిని అమెరికాలోకి తీసుకువస్తున్నారు? అనే విషయాలు తెలియవు. అక్రమంగా అమెరికాలో ప్రవేశించే ప్రయత్నంలో తరచూ ఈవిదంగా ట్రక్కులలో ఊపిరాడక చాలా మంది చనిపోతుంటారు.