జో బైడెన్‌ ప్రభుత్వంలో భారత్‌ సంతతికి మరో కీలక పదవి

June 23, 2022
img

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తన అధికారిక నివాసమైన వైట్‌హౌస్‌లో, తన ప్రభుత్వంలో పలు కీలక పదవులలో భారత్‌ సంతతికి చెందినవారిని నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా భారత్‌ సంతతికి చెందిన అంజలీ చతుర్వేదికి వెటరన్స్ ఎఫైర్స్  డిపార్ట్‌మెంట్‌లో జ‌న‌ర‌ల్ కౌన్సిల్‌గా నియమిస్తూ జో బైడెన్‌ ఆదేశం జారీ చేశారు. మాజీ సైనికోద్యోగులకు సంబందించి వివిద సేవలు, వారికి ప్రభుత్వం తరపున లభించే వివిద సదుపాయాలు, నగదు చెల్లింపులు తదితర వ్యవహారాలను ఈ వెటరన్స్ ఎఫైర్స్  డిపార్ట్‌మెంట్‌ పర్యవేక్షిస్తుంటుంది. అంజలీ చతుర్వేది ప్రస్తుతం అమెరికా న్యాయశాఖ క్రిమినల్ డివిజన్‌లో డెప్యూటీ అసిస్టెంట్ అటార్నీ జనరల్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.    


Related Post