చర్చిలో కాల్పులు...50 మంది మృతి

June 06, 2022
img

నైజీరియా దేశంలో చాలా దారుణం జరిగింది. ఒండో రాష్ట్రంలో ఓవో అనే పట్టణంలో సెయింట్ ఫ్రాన్సిస్ కాథలిక్ చర్చ్‌లో ఆదివారం ఉదయం ప్రార్ధనలు జరుగుతుండగా కొందరు దుండగులు తుపాకులతో ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరుపడంతో సుమారు 50 మంది పెంతెకోస్త్ ఆరాధకులు మృతి చెందారు. కొందరు చర్చిలోనే మృతి చెందగా మరికొందరు ఆసుపత్రులలో చికిత్స పొందుతూ మృతి చెందారు. చనిపోయినవారిలో చాలా మంది చిన్నారులు కూడా ఉన్నారు. చర్చిపై దుండగులు దాడి చేసిన తరువాత చర్చి ఫాదర్‌ను ఎత్తుకుపోయారని నైజీరియా శాసనసభ్యుడు అడెలెగ్బే టిమిలీయిన్ చెప్పారు. ఈ దారుణానికి పాల్పడినవారెవరో ఇంకా తెలియవలసి ఉంది. ఈ ఘటనపై నైజీరియా అధ్యక్షుడు మహమ్మద్ బుహారీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. 


Related Post