రష్యా దండయాత్రకి నాటోయే కారణం: పోప్

May 06, 2022
img

 గత రెండు నెలలుగా ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తూ అనేకమంది ప్రాణాలు బలిగొంటూనే ఉంది. రష్యా సైనికులు హత్యలు, అత్యాచారాలకు అంతే లేదు. రష్యా దెబ్బకి ఉక్రెయిన్ దాదాపు నేలమట్టం అయ్యింది. అయినా ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకోలేకపోయింది. ఉక్రెయిన్‌ కూడా ఏమాత్రం వెనక్కు తగ్గకుండా ఇంకా పోరాడుతూనే ఉంది. దీంతో రెండు నెలలుగా ఉక్రెయిన్‌లో ఈ మారణహోమం, విధ్వంసం ఇంకా కొన సాగుతూనే ఉంది. ఉక్రెయిన్‌లో ఇంత వినాశనం, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నా  నాటో దేశాలు, ఐక్య రాజ్య సమితితో సహా ఎవరూ ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తుండి పోయాయి.  

దీనిపై పోప్ ఫ్రాన్సిస్ స్పందిస్తూ, ఈ యుద్ధానికి రష్యా కంటే నాటో దేశాలు వాటికి మద్దతు ఇస్తున్న ఆమెరికాయే కారణమని నేను భావిస్తున్నాను. అమెరికా, నాటో దేశాలు రష్యా వాకిట నిలిచి సవాళ్ళు విసురుతుండటం వలననే రష్యాలో  అభద్రతాభావం పెరిగి ఈ యుద్ధానికి దారి తీసిందని నేను భావిస్తున్నాను. అయితే రష్యా చేస్తున్న ఈ పనిని నేను సమర్థించడం లేదు. రష్యా తక్షణం యుద్ధం నిలిపివేయాలని కోరుతున్నాను. ఇదే విషయమై నేను రష్యాతో మాట్లాడాలను కొన్నాను. కానీ రష్యా స్పందించలేదు. అయితే ఏదోవిదంగా నేను రష్యా అధ్యక్షుడు పుతీన్‌తో మాట్లాడి ఈ యుద్ధాన్ని ఆపించేందుకు నావంతు ప్రయత్నం నేను చేస్తాను,” అని అన్నారు.

Related Post