రష్యాకు షాక్ ఇచ్చిన ఐక్యరాజ్య సమితి

April 08, 2022
img

గత 45 రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తూనే ఉన్నప్పటికీ లొంగదీసుకోలేకపోవడంతో రష్యా దళాలు ఉక్రెయిన్‌లోని బుచా పట్టణంలో మహిళలపై అత్యాచారాలు చేసి, పౌరులను ఊచకోత కోసి రోడ్లపై పడేశారు. రష్యా సైనికుల దురాఘతాలకు సంబందించిన ఆ ఫోటోలు, వీడియోలు ప్రపంచవ్యాప్తంగా మీడియాలో ప్రముఖంగా ప్రసారం కూడా అయ్యాయి. దీనిపై తీవ్రంగా స్పందించిన అమెరికా ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం (యుఎన్‌ హెచ్‌ఆర్‌సీ) నుంచి రష్యాను తొలగించాలని కోరుతూ ఐక్యరాజ్య సమితి జనరల్ కౌన్సిల్‌లో ఓ తీర్మానం ప్రవేశపెట్టింది. ఐక్యరాజ్య సమితిలో 193 సభ్య దేశాలు ఉండగా వాటిలో ఈ తీర్మానానికి అనుకూలంగా 93 దేశాలు, వ్యతిరేకంగా 24 దేశాలు ఓటేశాయి. చైనా ఎప్పటిలాగే రష్యాకు మద్దతుగా తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఓటు వేయగా, ఎప్పటిలాగే భారత్‌తో సహా మరో 58 దేశాలు ఓటింగ్‌కు గైర్ హాజరయ్యాయి. 

ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం నుంచి బహిష్కరించడాన్ని తీవ్రంగా ఖండించగా, ఐసిస్‌ ఉగ్రవాదులలాగా  తమ ప్రజలను ఊచకోతకోస్తూ హేయమైన నేరాలకు పాల్పడుతున్న రష్యాకు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశంగా కొనసాగే హక్కు లేదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం రష్యాను తొలగించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

Related Post