రష్యాపై రోజూ కొత్త కొత్త ఆంక్షలు...అయినా తగ్గేదేలే

March 02, 2022
img

అమెరికా, యూరోపియన్ దేశాలు రష్యాపై ప్రతీరోజు కొత్త కొత్త ఆంక్షలు విధిస్తూనే ఉన్నాయి అయినా తగ్గేదేలే అంటూ ఉక్రెయిన్‌పై రష్యా బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతూనే ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచి ఈ వారం రోజుల్లో అమెరికా, యూరోపియన్ దేశాలు రష్యాపై విధించిన ఆంక్షలు: 

* రష్యా అధ్యక్షుడు పుతీన్‌తో సహా పలు బ్యాంక్ అకౌంట్లను నిలిపివేశాయి. దీంతో రష్యాకు చెందిన పలు సంస్థలు, ప్రముఖులు ఆ సొమ్ము తీసి వినియోగించుకోలేరు. ఆ అకౌంట్స్ ద్వారా ఎటువంటి లావాదేవీలు చేయలేరు.  

* ప్రపంచదేశాల బ్యాంకుల ఆర్ధిక లావాదేవీలను నిర్వహించే ‘స్విఫ్ట్ ఇంటర్నేషనల్ పేమెంట్ సిస్టమ్‌’లో రష్యాను బ్లాక్ చేశాయి. దీంతో రష్యా దేశంలో అంతర్జాతీయంగా ఎటువంటి ఆర్ధికలావాదేవీలు చేయలేదు. 

* అమెరికాతో సహా 11 యూరోపియన్ దేశాలు రష్యా విమానాలు తమ గగనతలంపై ప్రయాణించకుండా నిషేదించాయి. దీంతో రష్యా విమానాలు తమ గమ్యస్థానాలు చేరేందుకు చుట్టూ తిరిగివెళ్ళవలసి ఉంటుంది కనుక విమాన ఛార్జీలు భారీగా పెరిగిపోతాయి. ఇందుకు ప్రతిగా రష్యా కూడా ఆయా దేశాల విమానాలు తమ గగనతలంపై ప్రయాణించకుండా నిషేధం విధించింది.  

• రష్యాతో యూరోపియన్ దేశాలు దౌత్య సంబంధాలు తెంచుకొన్నాయి. వాణిజ్య, వ్యాపారాలపై కొన్ని నిషేధాలు, అనేక ఆంక్షలు విధించాయి. 

* రష్యా, ఉక్రెయిన్‌పై దాడిలో దానికి తోడ్పడుతున్న బెలారస్ దేశాలకు చెందిన క్రీడాకారులు 2024లో జరుగబోయే ఒలింపిక్స్ పోటీలలో పాల్గొనకుండా నిషేధించాయి. అలాగే పారాలింపిక్స్, వివిద క్రీడలలో ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీలలో కూడా రష్యన్ క్రీడాకారులు పాల్గొనకుండా నిషేధించాయి.   

* ఒలింపిక్స్ అసోసియేషన్‌కి అనుబందంగా పనిచేసే ఫిఫా మరియు యుఈఎఫ్ఏలు రష్యాను ఫుట్‌బాల్‌ పోటీలలో పాల్గొనకుండా నిషేధించాయి. 

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నిన్న వాషింగ్‌టన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “రష్యాపై ఇంకా చాలా ఆంక్షలు విధిస్తాము. రష్యా ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోగలదేమో గానీ ఆ దేశ ప్రజల మనసులను ఎన్నటికీ గెలుచుకోలేదు. ఉక్రెయిన్‌ ప్రజలకు అమెరికాతో సహా నాటో దేశాలన్నీ అండగా నిలబడతాయి,” అని అన్నారు.

* రష్యా దళాలు గూగుల్ మ్యాప్స్ వాడుకోకుండా గూగుల్ బ్లాక్ చేసింది. 

* యూట్యూబ్, ఫేస్ బుక్ కూడా ఆంక్షలు, నిషేధాలు విధించాయి.    

Related Post