ఉక్రెయిన్‌లో భారతీయులకు ఎంబసీ ముఖ్య సూచన

February 26, 2022
img

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులకు ఉక్రెయిన్‌లోని భారత్‌ ఎంబసీ ఒక ముఖ్య సూచన చేసింది. ఉక్రెయిన్‌లోని భారత్‌ అధికారులతో సమన్వయం చేసుకోకుండా ఎవరూ సరిహద్దుల వద్దకు వచ్చే ప్రయత్నం చేయవద్దని సూచించింది.  ఉక్రెయిన్‌ పశ్చిమ నగరాలలో పరిస్థితులు సాధారణంగానే ఉన్నందున ఆ ప్రాంతాలలో నివశిస్తున్నవారు సరిహద్దుల వద్దకు చేరుకొనేందుకు తొందరపడవద్దని సూచించింది. ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతాలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నందున ఎవరూ బయట తిరగవద్దని, నీళ్ళు, ఆహారం, మందులు మొదలైన అత్యవసరమైనవి నిలువ ఉంచుకోవాలని సూచించింది.      


Related Post