బలూచిస్తాన్‌లో 100 మంది పాక్‌ సైనికులు మృతి?

February 03, 2022
img

పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని పంజ్‌గుర్, నౌషికిలో గల రెండు పాక్‌ మిలటరీ బేస్‌లపై గురువారం బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులు చేసింది. ఈ దాడులలో 100 మంది పాక్‌ సైనికులు చనిపోయినట్లు బలూచ్ ఆర్మీ ప్రకటించుకొంది. కానీ బలూచ్ తిరుగుబాటు దారుల దాడిలో నలుగురు సైనికులు మాత్రమే చనిపోయారని, తమ సైనికుల ఎదురుదాడిలో 15 మంది బలూచ్ తిరుగుబాటుదారులు చనిపోయారని పాక్‌ హోంమంత్రి షేక్ రషీద్ అహ్మద్ చెప్పారు. బలూచ్ తిరుగుబాటుదారులను భారత్‌ ప్రోత్సహిస్తోందని పాక్‌ పదేపదే ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ పాక్‌ పత్రిక డాన్‌లో ఈరోజు దీనికి సంబందించిన ప్రచురించిన వార్తలో, “పాకిస్థాన్‌ ఇంటలిజన్స్ వర్గాలు బలూచిస్తాన్ తిరుగుబాటుదారులకు, భారత్‌, ఆఫ్ఘనిస్తాన్‌ దేశాలలో వారికి మద్దతు ఇస్తున్నవారికి మద్య జరిగిన సంభాషణలను పసిగట్టడంతో పాక్‌ సైనికులు ఈ దాడిని సమర్ధంగా తిప్పికొట్టారని పేర్కొంది. ఎదురుదాడిలో 13 మంది తిరుగుబాటుదారులు హతం అయ్యారని డాన్ పేర్కొంది. ప్రస్తుతం తిరుగుబాటు దారుల కోసం గాలింపు జరుగుతోందని డాన్ పేర్కొంది. 


Related Post