మంచులో చిక్కి చనిపోయినది గుజరాతీ కుటుంబం

January 29, 2022
img

జనవరి 19వ తేదీ అర్దరాత్రి కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తూ దారిలో మంచులో చిక్కుకొని ఓ భారతీయ కుటుంబం చనిపోయిన సంగతి తెలిసిందే. విదేశాంగ మంత్రి జయశంకర్ ఆదేశాల మేరకు అమెరికా, కెనడాలలోని భారత రాయబార కార్యాలయ అధికారులు వారి మృతదేహాలను స్వదేశానికి రప్పించేందుకు కృషి చేస్తున్నారు. 

మంచులో చిక్కుకొని చనిపోయినవారు గుజరాత్‌కు చెందిన జగదీష్ పటేల్ (39), ఆయన భార్య వైశాలి పటేల్ )37), వారి కుమార్తె విహంగి పటేల్ (11), కుమారుడు ధార్మిక్ పటేల్ (3)గా గుర్తించినట్లు ఒట్టావాలోని ఇండియన్ హైకమీషన్ అధికారులు తెలిపారు. 

జగదీష్ పటేల్ కెనడాకు వచ్చే ముందు గుజరాత్‌లో గాంధీనగర్ కలోల్ అనే పట్టణంలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. పటేల్ తన భార్యా పిల్లలను వెంటబెట్టుకొని 15 రోజుల క్రితమే విజిటింగ్ వీసాపై కెనడాకు వచ్చారని, అక్కడ ఓ స్థానిక ముఠా సాయంతో అక్రమంగా అమెరికాలో ప్రవేశించేందుకు ప్రయత్నించి మంచులో చిక్కుకొని చనిపోయారని తెలిపారు. అంటే పటేల్ కుటుంబం అమెరికాలో ప్రవేశించేందుకే కెనడాకు వచ్చి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. జగదీష్, వైశాలి దంపతులు అమెరికాకు వెళ్ళి అక్కడ బాగా సంపాదించి గొప్పగా బ్రతకాలనే ఆశతో చివరికి ప్రాణాలే పోగొట్టుకోవడం చాలా బాధాకరం.     


Related Post