అబుదాబి విమానాశ్రయంపై బాంబు దాడి

January 17, 2022
img

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంపై ఈరోజు సాయంత్రం డ్రోన్‌ ద్వారా రెండు బాంబు దాడులు జరిగాయి. ఒకటి ప్రధాన విమానాశ్రయం జరుగగా మరొకటి విమానాశ్రయానికి కొంచెం దూరంలో నిర్మాణంలో ఉన్న భవనాలపై జరిగింది. ప్రధాన విమానాశ్రయంపై జరిగిన దాడిలో కొద్దిగా ఆస్తి నష్టం తప్ప ఎటువంటి ప్రాణ  నష్టం జరుగలేదని విమానాశ్రయ అధికారులు చెప్పారు. నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీకి చెందిన మూడు ఆయిల్ ట్యాంకర్లు పేలిపోయి మంటలు చెలరేగాయి. ఈ బాంబు దాడిలో ముగ్గురు మృతి చెందగా ఆరుగురు గాయపడినట్లు సమాచారం. ఈ దాడులు తామే చేశామని ఇరాన్‌ అనుకూలవాదులైన హౌతి తిరుగుబాటుదారులు ప్రకటించారు. 


Related Post