అమెరికాలో రోడ్డు ప్రమాదం..ఎన్‌ఆర్ఐ కుటుంబంలో విషాదం

December 28, 2021
img

అమెరికాలోని లాస్ ఏంజలెస్ నగరంలో ఈనెల 18న జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ ఎన్‌ఆర్ఐ కుటుంబంలోని 14 ఏళ్ళ బాలుడు మరణించాడు. ఈ ప్రమాదంలో అతని తండ్రి, అక్క గాయపడ్డారు.   

జనగామ జిల్లా, లింగాల ఘనపురం మండలంలోని బండ్ల గ్రామానికి చెందిన చెట్టిపెల్లి రామచంద్రారెడ్డి 20 ఏళ్ళ క్రితం అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. లాస్ ఏంజలెస్ నగరంలో తన భార్య రజిత, పిల్లలు అక్షిత రెడ్డి (16), ఆర్జిత్ రెడ్డి (14)లతో నివాసం ఉంటున్నారు. 

ఈ నెల 18వ తేదీన వారు నగరంలోని బంధువుల ఇంటికి వెళ్ళి తిరిగివస్తుండగా వారి కారును వెనుక నుంచి దూసుకువచ్చిన మరో కారు బలంగా ఢీకొట్టడంతో వెనుక సీటులో కూర్చోన్న ఆర్జిత్ రెడ్డి ఘటనాస్థలంలోనే చనిపోయాడు. ఈ ప్రమాదంలో గాయపడిన రామచంద్రా రెడ్డి, అక్షిత్ రెడ్డి కోలుకొంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఆర్జిత్ రెడ్డి అకాలమరణం వారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

Related Post