అమెరికా వీసాలకు ఒమిక్రాన్‌ వరం

December 24, 2021
img

అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్‌ ఎన్నికైన తరువాత అమెరికా వీసాలపై ఆంక్షలు వాటితో కష్టాలు మొదలయ్యాయి. ఆయన హయాంలో కరోనా మహమ్మారి కూడా విరుచుకుపడటంతో అమెరికాలో ఉద్యోగాల గురించి ఇక ఆలోచించలేని పరిస్థితి ఏర్పడింది. తరువాత జో బైడెన్‌ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టి వీసాలపై ఆంక్షలు రద్దు చేయడం, అదే సమయంలో కరోనా తీవ్రత పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో మళ్ళీ డాలర్ డ్రీమ్స్ మొదలయ్యాయి. కానీ ఇప్పుడు అమెరికాపై ఒమిక్రాన్‌ విరుచుకు పడుతుండటంతో అందరూ ఆందోళన చెందారు. అయితే జో బైడెన్‌ ప్రభుత్వం అందరినీ సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయేలా నిర్ణయం తీసుకొంది. 

ఒమిక్రాన్‌ కారణంగా 2022 సంవత్సరానికి గాను హెచ్-1బీ వీసాలతో సహా అన్ని రకాల వీసాల జారీలో వ్యక్తిగత ఇంటర్వ్యూలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటిచింది. అయితే స్థానిక పరిస్థితులు, అభ్యర్ధులను బట్టి అవసరమనుకొంటే కౌన్సిలెట్ అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించవచ్చని పేర్కొంది.  

అమెరికా వీసాలు పొందడంలో చాలా కీలకమైనది ఇంటర్వ్యూ ప్రక్రియ. కొంత మంది అభ్యర్ధులు...ముఖ్యంగా అమెరికాలో ఉద్యోగాల కోసం వెళుతున్నవారు కౌన్సిలెట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు తడబడి సరైన సమాధానాలు చెప్పలేక చేతికి అందివచ్చిన వీసాను చేజార్చుకొంటుంటారు. ఒమిక్రాన్‌ పుణ్యామాని ఇప్పుడు ఆ ఇంటర్వ్యూలు ఉండవు కనుక ఇప్పుడు అమెరికా వీసాలు సంపాదించడం మరికాస్త సులువు అయ్యిందని భావించవచ్చు. అమెరికా వీసాల కోసం ఎదురుచూస్తున్న వారు ఇందుకు జో బైడెన్‌ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకోవలసిందే.  

Related Post