వైట్‌హౌస్‌ పీపీఓగా గౌతమ్ రాఘవన్

December 11, 2021
img

అమెరికాలో భారత్‌ సంతతికి చెందిన పలువురికి జో బైడెన్‌ ప్రభుత్వంలో కీలక పదవులు లభిస్తున్నాయి. భారత్‌కు చెందిన గౌత‌మ్ రాఘ‌వ‌న్‌  ప్రస్తుతం అమెరికా పాలసీ సలహాదారుగా, పీపీవో డిప్యూటీ డైర‌క్ట‌ర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనకు పదోన్నతి కల్పించి వైట్‌హౌస్‌ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ పర్సనల్‌ (వైట్‌హౌస్‌ పీపీఓ)గా జో బైడెన్‌ నియమించారు. ఇప్పటి వరకు ఆ బాధ్యతలు నిర్వహిస్తున్న క్యాథే రస్సెల్‌ను యునిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైర‌క్ట‌ర్‌గా నియమితులవడంతో ఆయన స్థానంలో గౌతమ్ రాఘవన్‌కు ఈ కీలక బాధ్యతలు అప్పగించారు. విశేషమేమిటంటే, ఆయన స్వలింగ సంపర్కుడు. అతని భర్త పేరు ఆండ్ర్యూ మస్లోస్కీ. వారిద్దరూ తమ దత్త పుత్రికతో కలిసి వాషింగ్‌టన్‌లో నివశిస్తున్నారు. 

Related Post