ప్రధానిగా ప్రమాణస్వీకారం...వెంటనే రాజీనామా

November 25, 2021
img

స్వీడన్ దేశ చరిత్రలో ఒకే రోజు రెండు అరుదైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకొన్నాయి. స్వీడన్‌ దేశ చరిత్రలో తొలిసారిగా ఒక మహిళా ప్రధాని మగ్ధలీనా అండర్సన్ (54) బుదవారం ప్రమాణస్వీకారం చేశారు. దీంతో ఆమెకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాధినేతలు అభినందనలు తెలియజేశారు. కానీ కొన్ని గంటల తరువాత పార్లమెంటులో ఆమె సంకీర్ణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఓడిపోవడంతో ఆమె ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న వామపక్ష పార్టీ మద్దతు ఉపసంహరించుకొంది. దాంతో మగ్ధలీనా అండర్సన్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “దేశ ప్రజలు నాకు ఓ అపూర్వమైన అవకాశం ఇచ్చి గౌరవించారు. కానీ మా ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్ధకంగా ఉన్నపుడు నేను ప్రభుత్వాన్ని నడిపించాలనుకోవడం లేదు. అందుకే రాజీనామా చేస్తున్నాను,” అని అన్నారు. 

Related Post