అమెరికా ఆరెంజ్ సిటీలో కాల్పులు

April 01, 2021
img

అమెరికాలో గత కొన్ని నెలలుగా తరచూ బహిరంగప్రదేశాలలో కాల్పులు జరుగుతుండటం, ప్రజలు ప్రాణాలు కోల్పోతుండటం జరుగుతోంది. తాజాగా దక్షిణ కాలిఫోర్నియాలో ఆరెంజ్ సిటీలోని లికోయిన్ అవెన్యూ ఆఫీసు భవనంలోకి నిన్న సాయంత్రం ఒక వ్యక్తి తుపాకీతో ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరుపడంతో ఒక చిన్నారితో సహా నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. వెంటనే సమీపంలో ఉన్న పోలీసులు అక్కడకు చేరుకొని అతనిని చుట్టుముట్టి అరెస్ట్ చేశారు. ఎదురుకాల్పులలో అతను స్వల్పంగా గాయపడ్డాడు.

అమెరికాలో తుపాకీ సంస్కృతికి తరచూ ఈవిదంగా ప్రజలు బలవుతున్నప్పటికీ, తుపాకుల తయారీ, అమ్మకాలపై కొన్ని వేలకోట్ల వ్యాపారం జరుగుతున్నందున, వాటిని తయారుచేసే సంస్థలు, వాటిని అమ్మే వ్యాపార సంస్థలు తుపాకుల అమ్మకాలపై ప్రభుత్వం నిషేదం విధించకుండా అడ్డుపడుతుంటాయి. ఈ పరిశ్రమపై పన్నుల రూపేణా భారీగా ఆదాయం సమకూరుతున్నందున ప్రభుత్వం కూడా తుపాకీ సంస్కృతిపై మౌనం వహిస్తుంటుంది. కనుక నిత్యం కొనసాగే ఈ నరమేధంలో తిలాపాపం తలా పిడికెడు అని సరిపెట్టుకొని చూస్తూ ఉండాల్సిందే.

Related Post