అమెరికాలో వారం రోజులు తిరక్కుండానే కొలరాడోలోని బౌల్డర్ నగరంలో నిన్న కాల్పులు జరిగాయి. సోమవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి తుపాకీతో స్థానిక కింగ్ సూపర్ మార్కెట్లోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఒక పోలీస్ అధికారితో సహా మొత్తం 9 మంది అక్కడికక్కడే చనిపోయారు. అనేకమంది గాయపడ్డారు. వెంటనే స్థానిక పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి అతనిని బందించారు. అతను ఎందుకు కాల్పులు జరిపాడనేది ఇంకా తెలియవలసి ఉంది.
కారణం ఏదైనప్పటికీ అమెరికాలో విచ్చలవిడిగా తుపాకుల విక్రయిస్తుండటం, ప్రజలు తుపాకులు కలిగి ఉండటం చట్టబద్దం కావడమే ఇందుకు ప్రధానకారణాలని చెప్పవచ్చు. వారం రోజుల క్రితమే అట్లాంటాలోని ఓ మసాజ్ సెంటరులో ఓ దుండగుడు కాల్పులు జరుపగా 8 మంది చనిపోయారు. ఇప్పుడు 10 మంచి చనిపోయారు. అయినా అమెరికాలో తుపాకీ సంస్కృతిని వదులుకోవడానికి ప్రజలూ, ప్రభుత్వం కూడా ఇష్టపడటం లేదు. కనుక అప్పుడప్పుడు ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. వాటిలో అమాయకులైన ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉంటారని చెప్పక తప్పదు.