మెట్లు ఎక్కలేక జో బైడెన్‌ ఆపసోపాలు

March 20, 2021
img

అమెరికా చరిత్రలో అత్యంత వృద్ద అధ్యక్షుడిగా జో బైడెన్‌ (78) సరికొత్త రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.  ఎప్పటికైనా అధ్యక్ష పదవి చేపట్టాలనే తన కల నెరవేర్చుకోగలిగారు కానీ ఈ వయసులో విపరీతమైన పని ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు ఆయనకు శాపంగా మారాయి. 

శుక్రవారం ఆయన జాయింట్‌ బేస్‌ ఆండ్రూస్‌ నుంచి అట్లాంటాకు తన అధికారిక ఎయిర్ ఫోర్స్-1 విమానంలో బయలుదేరారు. కానీ విమానం మెట్లు ఎక్కలేక చాలా ఆపసోపాలు పడ్డారు. ఒకటి రెండుసార్లు కింద పడ్డారు కూడా.  కానీ మళ్ళీ లేచి రెయిలింగ్ పట్టుకొని అతికష్టం మీద విమానంలోకి చేరుకోగలిగారు. ఆ ఫోటోలు అమెరికాతో సహా యావత్ ప్రపంచదేశాలలో మీడియాలో ప్రముఖంగా ప్రచురింపబడ్డాయి. వృద్ధాప్యం కారణంగా మతిమరుపు కూడా పెరిగిన దాఖలాలు కనిపిస్తున్నాయి. అధికారిక సమావేశాలలో అధికారుల పేర్లు, హోదాలు గుర్తులేక తడబడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై అమెరికా ప్రజలలో ముఖ్యంగా డెమొక్రాట్ మద్దతుదారులలో ఆందోళన నెలకొంది. 

ఈ నేపధ్యంలో జో బైడెన్‌ సమర్ధంగా పనిచేయగలరా? అమెరికాను ప్రగతిపదంలో నడిపించగలరా?అసలు నాలుగేళ్ళు అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించగలరా...లేదా?అని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జో బైడెన్‌ గెలిస్తే ఆరునెలల్లోగా ఉపాధ్యక్షురాలిగా పోటీ చేస్తున్న కమలా హారిస్‌ చేతికి పగ్గాలు వస్తాయని అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ ఎన్నికల ప్రచార సమయంలో గట్టిగా వాదించారు. బహుశః ఆయన జో బైడెన్‌ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొనే ఆ విదంగా అని ఉండవచ్చు. కనుక డోనాల్డ్ ట్రంప్‌ చెప్పిందే నిజం కాబోతోందా?అనే సందేహం కలుగకమానదు.

Related Post