విజయ్ దేవరకొండ వరుసపెట్టి సినిమాలు చేస్తున్నా, ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ మాత్రం తొందరపడరు. ఎంపిక చేసుకొని ఒకటి రెండేళ్ళకో సినిమా చేస్తుంటారు. తాజాగా ‘తక్షకుడు’ అనే క్రైమ్ రివెంజ్ స్టోరీతో ఓ సినిమా చేశారు. సూపర్ హిట్ హిందీ సినిమా ‘లాఫాతా లేడీస్’తో పాపులర్ అయిన నితాన్షి గోయల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
వినోద్ దర్శకత్వంలో 5 భాషల్లో రూపొందీస్తున్న ఈ సినిమా నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కాబోతోంది. సితారా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు.
‘వేటగాడి చరిత్రలో జింక పిల్లలే నేరస్తులు’ అనే క్యాప్షన్‌తో వేసిన ఆనంద్ దేవరకొండ పోస్టర్ అద్భుతంగా ఉంది. ఇప్పుడు తక్షకుడు టీజర్ కూడా విడుదల చేశారు. తక్షకుడు టీజర్ వరకు వచ్చేశాడు కనుక త్వరలోనే రిలీజ్ కాబోతోందని భావించవచ్చు.