అమెరికాలో భారత్‌ సంతతికి మరో కీలక పదవి

March 06, 2021
img

అమెరికాలో భారత సంతతికి చెందిన పలువురు కీలకపదవులలో నియమితులవుతున్నారు. తాజాగా భారత్‌ సంతతికి చెందిన నౌరీన్ హాసన్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్‌ ఫస్ట్ వైస్‌ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పదవిలో నియమితులయ్యారు. ఈనెల 15 నుంచి ఆమె నియామకం అమలులోకి వస్తుందని ఆ బ్యాంక్ ప్రెసిడెంట్ మరియు సీఈఓ జాన్ విలియమ్స్ తెలిపారు. 

నౌరీన్ హాసన్ తల్లితండ్రులు కేరళ రాష్ట్రానికి చెందినవారు. వారు కొన్ని దశాబ్ధాల క్రితం అమెరికాకు వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. నౌరీన్ హాసన్ అమెరికాలోనే పుట్టి పెరిగారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యూయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ చేసారు. గత 25 ఏళ్లుగా ఆమె ఆర్ధికరంగంలోని స్ట్రాటజీ, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్, సైబర్ సెక్యూరిటీ, రెగ్యులేటరీ, రిస్క్ మేనేజిమెంట్ విభాగాలలో పనిచేస్తూ అపార అనుభవం, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొన్నారు. ఈ నియామకానికి ముందు ప్రపంచ ప్రఖ్యాత ఆర్ధిక సంస్థ మోర్గాన్ స్టాన్లీ వెల్త్ మేనేజిమెంట్‌లో చీఫ్ డిజిటల్ ఆఫీసర్‌గా పనిచేశారు.

Related Post