అమెరికాలో వికారాబాద్ వాసి నిఖిల్ మృతి

February 11, 2021
img

వికారాబాద్‌ పట్టణంలోని గంగారానికి చెందిన నిఖిల్ (35) అనే యువకుడు అమెరికాలో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. వినోద్ కుమార్, హిమజ్యోతి దంపతుల కుమారుడైన నిఖిల్ కాలిఫోర్నియాలో టిసీఎస్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇటీవల అతను కాలిఫోర్నియా నుండి టెక్సాస్ వెళుతుండగా న్యూమెక్సికో వద్ద ఎదురుగా శరవేగంతో దూసుకువచ్చిన ఓ వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిఖిల్ మృతితో అతని తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.     


Related Post