భారత్‌పై బైడెన్‌ ప్రభుత్వం ప్రశంశలు

February 10, 2021
img

అమెరికా కొత్త అధ్యక్షుడు జోబైడెన్ ప్రభుత్వం భారత్‌ను ప్రశంసలతో ముంచెత్తింది. అమెరికా అధికార ప్రతినిధి నెగప్రైస్ వాషింగ్‌టన్‌లో మీడియాతో మాట్లాడుతూ, కరోనా వ్యాక్సిన్లను విదేశాలకు పంపడం భారత్ చేసిన గొప్ప సహాయంగా అభివర్ణించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ అజేయ శక్తిగా మారనుందని అన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతాలలో శాంతి స్థాపనకు భారత్ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అమెరికా- భారత్‌ల మధ్య వాణిజ్య బంధాన్ని మరింత బలపరిచేందుకు కృషి చేస్తామని నెగప్రైస్ అన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి అనువైన వాతావరణం ఉందని తెలిపారు. త్వరలోనే భారత్ పెట్టుబడుల కేంద్రంగా మారనుందని అన్నారు. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా అమెరికా విదేశాంగశాఖ విధానాల గురించి మాట్లాడినప్పుడు దానిలో భారత్‌ ప్రస్తావన లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా మీడియా సమావేశంలో భారత్‌ గురించి ఈవిధంగా మాట్లాడటం ద్వారా జో బైడెన్‌ ప్రభుత్వం భారత ప్రాముఖ్యతను గుర్తించిందని స్పష్టమవుతోంది. అంతకు ముందు భారత విదేశాంగ మంత్రి జయశంకర్ సుబ్రహ్మణ్యంతో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లీకెన్‌ ఫోన్లో మాట్లాడారు

Related Post