లాటరీ విధానంలోనే హెచ్-1బీ వీసాల జారీ

February 06, 2021
img

వలస ఉద్యోగుల పట్ల ఉదారంగా వ్యవహరిస్తానని హామీ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, హెచ్-1బీ వీసాల జారీలో గతంలో ట్రంప్‌ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలను పక్కనపెట్టి ఈ ఏడాది డిసెంబర్‌ 31వరకు లాటరీ విధానంలోనే హెచ్-1బీ వీసాలను జారీ చేయాలని నిర్ణయించారు. ట్రంప్‌ హయాంలో తీసుకొన్న నిర్ణయాలను 2021 డిసెంబర్‌ 31 వరకు వాయిదా వేస్తున్నట్లు అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్స్ సర్వీసస్ ప్రకటించింది. కనుక హెచ్-1బీ వీసాల కోసం ట్రంప్‌ ప్రభుత్వం సూచించినట్లు జీతాలు, మెరిట్ తదితర అంశాలను  అమెరికా ప్రభుత్వం ఇప్పుడు పరిగణనలోకి తీసుకోబోదని స్పష్టమైంది. కనుక హెచ్-1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకొన్న భారతీయులకు ఇది చాలా శుభవార్తే. 


Related Post