భారత్‌ వ్యాక్సిన్‌ సామర్ధ్యం ప్రపంచానికే ఆస్తివంటిది: ఐరాస

January 29, 2021
img

భారత్ తయారు చేసిన కోవాక్సిన్, కోవిషిల్డ్ వ్యాక్సిన్లు సత్ఫలితాలు ఇస్తున్నాయని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెరస్ ప్రశంసించారు. ఆంటోనియో గుటెరస్ న్యూయార్క్‌లో అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలోనే భారత్ తయారు చేసిన వ్యాక్సిన్‌ ఉత్తమమైనదిగా తెలిపారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టడంలో భారత్ చాలా కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. భారత్‌లో 140 కోట్ల జనాభా ఉన్నప్పటికీ కరోనాను నివారించడంలో విజయం సాధించిందని అన్నారు. భారత్‌లో తయారుచేసిన కోవాక్సిన్‌ను ఇరుగుపొరుగు దేశాలతో సహా ప్రపంచదేశాల అందిస్తుండటంపట్ల హర్షం వ్యక్తం ఆంటోనియో గుటెరస్ చేశారు. భారత్‌ ఇప్పటివరకు 55లక్షల వ్యాక్సిన్‌ డోసులను విదేశాలకు పంపించిందని ఇది చాలా గొప్ప విషయమని అన్నారు. భారత్‌ తయారుచేసిన వ్యాక్సిన్లను గ్లోబల్ వాక్సిన్లగా ప్రచారం చేయాలని అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఆంటోనియో గుటెరస్ సూచించారు.

భారత్‌ నిరుపేద ఆఫ్రికా దేశాలకు ఒక కోటి వ్యాక్సిన్‌ డోసులను, ఐక్యరాజ్య సమితికి వేరేగా మరో 10 లక్షల వ్యాక్సిన్‌ డోసులను ఇవ్వబోతోందని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ ఢిల్లీలో మీడియాకు చెప్పారు.

Related Post