రేపే బైడెన్‌ ప్రమాణస్వీకారం...

January 19, 2021
img

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ బుదవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. అమెరికా కాలమాన ప్రకారం బుదవారం ఉదయం 11.30 గంటలకు (భారత కాలమాన ప్రకారం బుదవారం రాత్రి 10 గంటలకు) వాషింగ్‌టన్‌లోని క్యాపిటల్ హిల్ భవనంలో జాతీయగీతాలపనతో 59వ ప్రెసిడెన్షియల్ ఇనాగరల్ సెర్మోనీ మొదలవుతుంది. 

అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ చేత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ప్రమాణస్వీకారం చేయిస్తారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ చేత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సోనియా సోటోమేయర్ ప్రమాణస్వీకారం చేయిస్తారు.

అనంతరం అధ్యక్షుడు జో బైడెన్‌ దేశప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగిస్తారు. ఆ తరువాత ఆనవాయితీ ప్రకారం వారిరువురూ,  మాజీ అధ్యక్షులు...వారి కుటుంబ సభ్యులు...అందరూ కలిసి ఆర్లింగ్‌టన్ నేషనల్ సెమెట్రీ (శ్మశానవాటిక)కు వెళ్ళి అక్కడ సైనికుల సమాధులపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు ఆర్పిస్తారు. 

తరువాత ఆనవాయితీ ప్రకారం అక్కడి 15వ వీధి నుండి జో బైడెన్‌ దంపతులను పూర్తి మిలటరీ ఎస్కార్ట్ తో తోడ్కొని వైట్‌హౌస్‌ తీసుకువస్తారు. ఈ అధికారిక కార్యక్రమాలన్నీ ముగిసిన తరువాత ‘సెలబ్రేటింగ్ అమెరికా’ పేరుతో 90 నిమిషాలపాటు సాగే ఓ సాంస్కృతిక కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నిటినీ అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో పలు న్యూస్ ఛానల్స్ లైవ్ కవరేజ్ ఇవ్వనున్నాయి. 

Related Post