హెచ్-1బీ వీసాలతో అమెరికాలో ఉద్యోగాలకు బ్రేక్?

August 04, 2020
img

కరోనా ప్రభావంతో లక్షలాదిమంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. సరిగ్గా అధ్యక్ష ఎన్నికలకు 3-4 నెలల ముందే ఈవిధంగా జరగడంతో ట్రంప్‌ విజయావకాశాలు దెబ్బ తినే ప్రమాదం ఏర్పడింది. దాంతో ట్రంప్‌ అమెరికన్లకు ఉద్యోగావకాశాలు పెంచేందుకు మళ్ళీ హెచ్-1బీ వీసాలపైనే దృష్టి సారించారు. ఇప్పటికే ఆ వీసాలపై అనేక ఆంక్షలు విధించిన ట్రంప్‌ ఇప్పుడు విదేశీయులు వాటితో అమెరికాలో ఉద్యోగాలు పొందకుండా అడ్డుకొనేందుకు సోమవారం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌పై సంతకం చేశారు. అమెరికాకు తోడ్పడే మేధావులు, నిపుణుల కోసమే హెచ్-1బీ వీసాలను వినియోగించుకోవాలని కోరుకొంటున్నాను. కష్టపడి పనిచేసే అమెరికన్లను కాదని తక్కువ వేతనాలకు పనిచేసే విదేశీయులను నియమించుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నాను. అందుకే ఇకపై ఫెడరల్ ప్రభుత్వం సాధారణ ఉద్యోగాలలో అమెరికన్లు మాత్రమే నియమించుకోవాలని వారికే ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకొంటున్నాను,” అని ట్రంప్‌ అన్నారు. 

కనుక ఇకపై హెచ్-1బీ వీసాలతో అమెరికాలో సాధారణ స్థాయి ఉద్యోగాలు లభించకపోవచ్చు. అయితే ఈ అంశంపై ట్రంప్‌ ప్రభుత్వం మరింత స్పష్టత ఈయవలసి ఉంటుంది.      


Related Post