సాకర్ ఆటగాడిని పెళ్ళిచేసుకొన్న ఫిన్‌లాండ్ ప్రధాని సన్నా మారిన్

August 04, 2020
img

ఆమె ఓ దేశానికి ప్రధానమంత్రి. అతను ఓ మంచి ఫుట్ బాల్ ఆటగాడు. వారిరువురూ పెళ్ళి చేసుకొన్నారు. వారే ఫిన్‌లాండ్ ప్రధానమంత్రి సన్నా మారిన్, మార్కుస్ రైక్కోనెన్. వారిరువురూ 18 ఏళ్ళ వయసులో తొలిసారి కలుసుకొన్నారు. అప్పటి నుంచి 16 ఏళ్ళపాటు వారి ప్రేమానుబందం కొనసాగింది. ఆ బందానికి తీపి గుర్తుగా వారికి ఓ పాప కూడా పుట్టింది. ఆ పాపకు ఇప్పుడు రెండేళ్ళు నిండాయి. 

సన్నా మారిన్ (34) రాజకీయాలలోకి ప్రవేశించి ఫిన్‌లాండ్ ప్రధాని అయ్యింది. అతి తక్కువ వయసులో అత్యున్నత పదవి చేపట్టిన మహిళగా ఆమె పేరు పొందింది. ఆమె రాజకీయాలలో, అతను ఫుట్‌బాల్ పోటీలలో క్షణం తీరికలేకుండా గడుపుతుండటంతో ఇంతకాలం వారు పెళ్ళి చేసుకోలేకపోయారు. కరోనా పుణ్యామని ఇప్పుడు ఇద్దరికీ తగినంత సమయం లభించడంతో శనివారం పెళ్ళి చేసుకొన్నారు. 

ప్రధాని అధికారిక నివాసంలో నిరాడంబరంగా జరిగిన వారి వివాహానికి కేవలం 40 మంది మాత్రమే హాజరయ్యారు. ప్రధాని సన్నా మారిన్ తమ పెళ్ళి ఫోటోలను ఇంస్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ప్రజలకు, బంధుమిత్రులకు తెలియజేశారు.

Related Post