హెచ్-1బీ వీసాలకు ఓకే కానీ...

July 18, 2020
img

హెచ్-1బీ వీసాలతో అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న ప్రవాసభారతీయులకు ఓ శుభవార్త. కరోనా... లాక్‌డౌన్‌ కారణంగా భారత్‌లోని వారి జీవితభాగస్వాములు లేదా తల్లితండ్రులు లేదా పిల్లలు ఉండిపోయినట్లయితే వారు అమెరికా తిరిగిరావచ్చునని తెలిపింది. డిసెంబర్ వరకు హెచ్-1బీ వీసాలపై తాత్కాలికంగా నిషేదం విధించినప్పటికీ, ఈ విషయంలో వారికి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది. జూన్‌కు 24 నాటికి చెల్లుబాటులో ఉన్న వీసాలు కలిగినవారిని మాత్రమే అనుమతిస్తామని లేకుంటే డిసెంబర్ నెలాఖరు వరకు వేచి ఉండవలసిందేనని స్పష్టం చేసింది. లాక్‌డౌన్‌ సమయంలో భారత్‌లోని యూఎస్ కౌన్సిలెట్ కార్యాలయ సిబ్బంది ప్రత్యేక విమానాలలో స్వదేశానికి తిరిగివెళ్లిపోయారు. కానీ వారు ఎప్పుడు భారత్‌ తిరిగివస్తారో... ఎప్పుడు కౌన్సిలెట్ కార్యాలయాలు తెరుస్తారో  తెలియదు. కనుక వారు తిరిగివచ్చి కార్యలయం తెరిచేవరకు ఎదురుచూడక తప్పదు. దేవుడు వరమిచ్చినా పూజారి ఇవ్వడంటే ఇదేనేమో? 


Related Post