తమిళనాడు రాజకీయాలలో మరో కొత్త పార్టీ

March 13, 2026


img

తమిళనాడు రాజకీయాలలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ నేతృత్వంలో ‘ఆల్ ఇండియా పురచ్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కళగం’ అనే కొత్త పార్టీని నేడు ప్రకటించారు. పార్టీలో అందరూ ఉమ్మడి కుటుంబంలా కలిసి మెలిసి పనిచేస్తామని చెప్పేందుకుగాను కొబ్బరి చెట్ల సమూహాన్ని పార్టీ గుర్తుగా శశికళ ప్రకటించారు.

ప్రముఖ కోలీవుడ్‌ నటుడు విజయ్‌ దళపతి ఇటీవలే సినిమాలకు గుడ్ బై చెప్పేసి టీవీకే పార్టీతో అప్పుడే ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. ఆయన ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేయాలనీ నిశ్చయించుకున్నారు. 

తమిళనాడు రాజకీయాలపై మంచి పట్టు, అవగాహన, ఎక్కడికక్కడ అనుచరులు ఉన్న శశికళ కూడా ఇప్పుడు కొత్త పార్టీతో వచ్చారు. ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్‌ కూటమి అధికారంలో ఉండగా, అన్నాడీఎంకే-బిజేపిలు ప్రతిపక్షంలో ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు కొత్త పార్టీలు వచ్చాయి. అవి గెలవలేకపోయినా ఓట్లు చీల్చి డీఎంకే, అన్నాడీఎంకేలకు చాలా నష్టం కలిగించ గలవు. కనుక ఏప్రిల్‌-మే నెలల్లో జరుగబోయే ఎన్నికలలో ఏ కూటమి, పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవచ్చు. 


Related Post