తెలంగాణ ప్రభుత్వం జిహెచ్‌ఎంసిని మల్కాజ్‌గిరి, సైబరాబాద్ కార్పోరేషన్లుగా విభజించి, మళ్ళీ వాటిలో సర్కిల్స్, డివిజన్లు ఏర్పాటు చేసింది. తెలంగాణ బిజేపి అధ్యక్షుడు రాంచందర్ రావు దీనిపై స్పందిస్తూ, నిన్నే అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పారుగా... సిఎం రావు అయినా రెడ్డి అయినా మా దగ్గరకు వచ్చి సాయం అడగాల్సిందేనని. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మేం సాయం చేయబట్టే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని కూడా చెప్పారు కదా? దానికి దక్షిణగా జిహెచ్‌ఎంసిని మూడు ముక్కలు చేసి ఓ ముక్కని ఓవైసీలకు అప్పగించారు. అంతే తప్ప ప్రజల కోసం కానే కాదు,” అని అన్నారు.
మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రిని ఉద్దేశ్యించి బహిరంగంగా అంత మాట అన్నాడీఎంకే కూడా కాంగ్రెస్ పార్టీ స్పందించకపోవడం గమనిస్తే, అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ మజ్లీస్ సహాయ సహకారాలు ఎంత అవసరమో అర్ధమవుతుంది.
కానీ ఓవైసీలదే పూర్తిగా పైచేయి అని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే, మహారాష్ట్ర, యూపీ, బిహార్ వంటి ఇతర రాష్ట్రాలలో పోటీ చేస్తున్న మజ్లీస్ పార్టీని తెలంగాణలో మాత్రం పాతబస్తీ దాటకుండా బాగానే కట్టడి చేస్తున్నారు కదా ముఖ్యమంత్రులు?