నా భర్త ఫోన్‌ ట్యాప్ చేయించారు సిగ్గుందా మీకు?

December 12, 2025

img

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేడు బీఆర్ఎస్‌ పార్టీని ఇరుకున పెట్టే మరో సంచలన ఆరోపణ చేశారు. ఈరోజు జాగృతి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, “పదేళ్ళు నేను పార్టీలో ఉన్నప్పుడు ఎన్నడూ నా భర్త గురించి ఎవరూ మాట్లాడలేదు. పార్టీలో నుంచి నన్ను బయటకు వెళ్ళగొట్టారు. అయినా మీ కళ్ళు చల్లబడటం లేదా?

నేను పార్టీలో, బీఆర్ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడే నా భర్త ఫోన్‌ ట్యాప్ చేశారు. ఆ సంగతి మాకు తెలుసు. కానీ నోరు విప్పితే మా పార్టీ, ప్రభుత్వం పరువే పోతుందని మౌనంగా భరించాము. ఇన్నేళ్ళుగా నా భర్త గురించి మాట్లాడనివారు ఇప్పుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇలాగే రెచ్చిపోతే ఎవరినీ విడిచిపెట్టను,” అంటూ హెచ్చరించారు.

ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓ ప్రముఖ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే తన తండ్రి హయంలో తమ ఇంట్లో పనివారితో సహా అందరి ఫోన్లు ట్యాపింగ్ చేయబడ్డాయని చెప్పారు. నేడు అదే ముక్క మరికాస్త గట్టిగా స్పష్టంగా చెప్పారు.

కేసీఆర్‌ కూతురు కల్వకుంట్ల కవిత స్వయంగా తమ ఫోన్లు ట్యాపింగ్ చేశారని చెపుతున్నప్పుడు, అసలు ఫోన్‌ ట్యాపింగే జరగలేదంటూ బీఆర్ఎస్‌ పార్టీ బుకాయిస్తే ప్రజలు నమ్ముతారా?

ముఖ్యంగా ఈ కేసులో ప్రభాకర్ రావుని నేడు పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారణ జరుపుతున్నప్పుడు కల్వకుంట్ల కవిత ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడటం బీఆర్ఎస్‌ పార్టీకి ముఖ్యంగా కేసీఆర్‌, కేటీఆర్‌లకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది.

ఆమె స్వయంగా ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడారు కనుక ఒకవేళ సిట్ అధికారులు విచారణకి పిలిస్తే ఆమె తప్పకుండా కొన్ని రహస్యాలు బయటపెడతారు. కనుక బీఆర్ఎస్‌ నేతలు ఆమెపై ఎంతగా కత్తులు దూస్తే అంత వారికీ, వారి అధినేతలు కేసీఆర్‌, కేటీఆర్‌కే చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.

నా భర్త ఫోన్ ట్యాపింగ్ చేయించారు.సిగ్గు లేదా ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేయించడానికి? నన్ను పార్టీ నుంచి వెళ్లగొట్టినా ఇంకా మీ కళ్లు చల్లబడలేదా? ఢిల్లీలో నేను కొట్లాడుతుంటే ఏసీ గదిలో ఉంటూ కేసీఆర్ చాటున ప్రజల సొమ్ము పందికొక్కులా తిన్నారు

- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత pic.twitter.com/rey6qhsgAj
— BIG TV Breaking News (@bigtvtelugu) December 12, 2025

Video Courtesy: Big TV Breaking News)

Related Post