తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేడు హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిలపై నిప్పులు చెరిగారు.
“మాధవరం కృష్ణారావు అవినీతిని నేను ప్రశ్నిస్తే వాటికి ఆయన సూటిగా జవాబు చెప్పకుండా వాటిని నాకు ఆపాదిస్తూ నోటికి వచ్చినట్లు మాట్లాడారు. ఉద్యమ సమయంలో ఎవరెవరు ఎవరెవరిని బెదిరించారో... ఉద్యమాల పేరు చెప్పుకొని ఎంత దండుకున్నారో నాకన్నీ తెలుసు. కానీ వాటి గురించి అప్పుడు మాట్లాడితే ఉద్యమాలు దెబ్బ తింటాయని మౌనంగా ఉండిపోయాను.
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ నేను ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి లబ్ది పొందలేదు. నేను ఏ తప్పు చేయలేదు కనుకనే ఇంత ధైర్యంగా ప్రజల మధ్యకు వెళ్ళి మాట్లాడగలుగుతున్నాను. కానీ నా గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడితే సహించబోను,” అంటూ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. టీన్యూస్, ఆమె లీగల్ నోటీసులు కూడా పంపారు. వారం రోజుల్లోగా బహిరంగ తనకు క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
ఆమె ఏమన్నారో ఆమె మాటల్లోనే....