తెలంగాణ మంత్రి కొండా సురేఖకు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. ఆమెపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్త్రీలోలుడు అని విమర్శిస్తూ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అందుకుగాను కేటీఆర్, ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున ఇద్దరూ చెరో వంద కోట్లకు ఆమెపై పరువు నష్టం దావాలు వేశారు.
ఆమె నాగార్జునకు క్షమాపణలు చెప్పుకొని ఆ కేసు నుంచి విముక్తి పొందారు. కానీ కేటీఆర్ ప్రత్యర్ధి పార్టీకి చెందినవారు కనుక క్షమాపణలు చెప్పుకోలేదు. అందువల్ల ఒకవేళ ఆమె తెర వెనుక రాజీకి ఏమైనా ప్రయత్నాలు చేసి ఉంటే అవి ఫలించలేదని ఈ వారెంట్‌తో స్పష్టమవుతోంది.
న్యాయస్థానం ఈ కేసు తదుపరి విచారణకు ఫిబ్రవరి 5కి వాయిదా వేసి మంత్రి కొండా సురేఖకు తగినంత సమయం కూడా ఇచ్చింది. కనుక ఈ రెండున్నర నెలల్లో ఆమె కేటీఆర్‌తో రాజీ కుదుర్చుకునేందుకు ఏమైనా చేస్తారా లేదా ఆయనకు కూడా బహిరంగంగా క్షమాపణలు చెప్పి ఈ కేసు నుంచి బయటపడతారా? ఫిబ్రవరి 5లోగా తెలుస్తుంది.